Thursday 22 January 2015

Godavari Pushkaralu (14-7-2015 - 25-7-2015)

గోదావరి మాతకు పుష్కర వైభవము:


మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి సుమారు 1665 మైళ్ళకు పైబడి ప్రవహీంచి చివరకు తూర్పున బంగాళఖాతంలో సాగర సంగమమవుతుంది. ఈ నది 
గో కళేబరమును ఆవరించి ప్రవహించినది కావున "గోదావరి" అని పేరు వచ్చినది.బృహస్పతి ప్రతిరాశిలోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్నిఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు.
ఈ సంవత్సరం పుష్కరం వచ్చే నది : గోదావరి
బృహస్పతి ప్రవేశించిన రాశి: కర్కాటక రాశి
పుష్కరాలు జరిగే ప్రదేశాలు: భద్రాచలము, రాజమండ్రి మరియు యితర ప్రదేశములు
తేది.14-7-2015 నుండి 25-7-2015 వఱకు.
పుష్కర కాలము--- 12 రోజులు
పుష్కరము అంటె -12 సంవత్సరములు
ఈ పుష్కర సమయములో విధిగా దాన ధర్మములు మరియు పితృకార్యక్రమములు చేయవలయును.
పుష్కర సమయములో చేయవలసిన దానములు:
తేది దైవం పేరు - దానములు/పూజలు
జులై 14 నారాయణ - ధాన్యము,రజితము,సువర్ణము
జులై 15 భాస్కర - వస్త్రము,లవణము,గోవు,రత్నము.
జులై 16 మహాలక్ష్మి - బెల్లము,కూరలు,వాహనము
జులై 17 గణపతి - నేయి,నువ్వులు,తేనె,పాలు,వెన్న
జులై 18 శ్రీకృష్ణ - ధాన్యము,బండి,గేదె,ఎద్దు,నాగలి
జులై 19 సరస్వతి - కస్తూరి,గంధపుచెక్క,కర్పూరము.
జులై 20 పార్వతి - గృహము,ఆసనము,శయ్య.
జులై 21 పరమేశ్వరుడు- కందమూలములు,అల్లము,పుష్పమూలము 
జులై 22 అనంత - కన్య,పఱుపు,చాప
జులై 23 నరసింహ దుర్గ,లక్ష్మి,దేవి పూజ,సాలగ్రామం
జులై 24 వామన కంబళి,సరస్వతి,యజ్నోపవీతము,వస్త్రము,తాంబూలము
జులై 25 శ్రీరామ - దశ,షోడశ మహాదానములు

No comments:

Post a Comment