Wednesday 28 January 2015

Jayaho Modi


జయహో !
**********
అసలు అమెరికాకు రాకూడదన్నారు ,లేనివి పోనివి చిలవులు పలవులుగా చెప్పారు , ఆయనకు వీసా ఇవ్వకుండా శతవిధాలా ప్రయత్నించారు , నియంత అన్నారు , ఖూనీకోర్ అన్నారు , కేసులమీద కేసులు పెట్టారు , ఆయనను కించపరుస్తున్నామనుకుంటూ దేశం పరువుతీసారు , నానా ఇబ్బందులు పెట్టారు , ఇంకొకడైతే పారిపోయేవాడే , కాని ఆయన నమ్ముకున్న సిద్దాంతాన్ని పదవికోసం అమ్ముకోలేదు , రోజుకో మాట మాట్లాడలేదు ,చట్టానించి తప్పించుకోలేదు ,ప్రజలోకి వెళ్ళాడు , తన కష్టసుఖాలు చెప్పుకున్నాడు ,తను కలగన్న భారతదేశం గురించి చెప్పాడు ,తను ముఖ్యమంత్రిగా వున్న గుజరాత్ ను చూపించాడు , ప్రజలునమ్మారు , గద్దెనెక్కించారు ,వద్దన్న అమెరికా రమ్మని విసా పంపింది , బ్రహ్మరధం పట్టింది ,ఇంతవరకు ఏ దేశ ప్రధానికి దక్కని గౌరవం దక్కింది ,అమెరికాను ఒక వూపు వూపాడు.శభాష్ అనిపించాడు ,నవరాత్రులలో వెళ్ళాడు ,అంత పెద్ద దేశాధినేత విందు ఇస్తే ఉపవాసం అంటూ నిమ్మరసం తాగాడు , భారతదేశ గొప్పతనాన్నే చెప్పాడు కాని ఎక్కడ అర్ధించలేదు , ఆ అగ్రరాజ్యాధినేతను పొగడలేదు.
భారతం రమ్మని ఆహ్వానించాడు , ఆయన వచ్చాడు ,మన సాంప్రదాయం ప్రకారం అతిథి మర్యాదలు చేసారు ,మనదేశ గొప్పతనాన్ని గణతంత్రదినోత్సవం రోజు ఏమిటో చూపించాము , ఏమి అర్ధించలేదు , అడగలేదు కలసివుంటే కలదు సుఖం అన్నాము.ఇద్దరం కలిస్తే తిరుగులేదన్నాం.
ఆ అగ్రరాజ్యాధినేత మన ప్రధానిని మెచ్చుకున్నాడు , కార్యధక్షతను ప్రసంసించాడు ,స్నేహ హస్తం అందించాడు.
- ఇది కొంతమంది భరించలేకపోయారు ,అసూయపడ్డారు ,వారికెందుకు దాసోహం అనాలి అన్నారు , ఇంకా ఆయన వారి దేశం వెళ్ళకుండానే మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో చెప్పాలన్నారు , డిబేటులలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ,వారి మొహాలలో అసూయ ద్వేషం ,ఉక్రోషం ప్రస్పుటంగా కనిపిస్తూనే వున్నాయి , వారు రాజకీయ అనాధలు వారిని చూసి జాలిపడదాం.
ఇంకా ఆయన గద్దెనెక్కి సంవత్సరం కూడా కాలేదు ,కాస్త ఆగుదాం , ఆ ఉక్కుమనిషిని నమ్ముదాం , అరవై ఏళ్ళలో పోగొట్టుకున్నాం మన దేశ ప్రతిష్ట , గౌరవం ,మర్యాద ! అంతకన్నా ఈ ఐదేళ్ళలో ఏమి ఘోరం జరిగిపోదు , ఇంతవరకు అమెరికాను అడుకున్న ప్రధానులే ఎక్కువ , మొట్టమొదటిసారిగా వారితో సరి సమానంగా నించున్నాం , అది చాలు నాలాంటివాడికి.
జయహో మోడి ! జయహో భారత్!

No comments:

Post a Comment